పదేళ్ల తర్వాత ఎన్నో ఆశలతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది ప్రగ్యా జైశ్వాల్. అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ నటుడు తనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాడని సంబరపడింది. అయితే అతడే డిజాస్టర్లలో ఉన్నాడని, బ్యాడ్ లక్ ను బ్యాక్ ప్యాకెట్ లో పెట్టుకొని తిరుగుతున్నాడని గ్రహించలేకపోయింది. ఫలితంగా ప్రగ్యా బాలీవుడ్ రీఎంట్రీ పల్టీ కొట్టింది.
“ఖేల్ ఖేల్ మే” అనే సినిమాతో బాలీవుడ్ లో మరోసారి అడుగుపెట్టింది ప్రగ్యా జైశ్వాల్. సినిమాకు మంచి రిలీజ్ డేట్ సెట్ చేశారు. ఆగస్ట్ 15.. లాంగ్ వీకెండ్. మరోవైపు ప్రచారం కూడా ఊదరగొట్టారు. కానీ జనం పట్టించుకోలేదు.
వరుసగా డిజాస్టర్లిస్తున్న అక్షయ్ కుమార్ సినిమాలపై జనాలకు మొహంమొత్తింది.
దీంతో “ఖేల్ ఖేల్ మే” సినిమాను పట్టించుకున్న నాధుడు లేడు. మొదటి రోజు ఈ సినిమాకు ఇండియా అంతటా కేవలం 5 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు రాగా..మొదటి వీకెండ్ (నాలుగు రోజులు) ఈ సినిమా కేవలం 14 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. అవును అక్షయ్ కుమార్ వంటి హీరో నటించిన సినిమా నాలుగు రోజుల్లో ఇండియాలో 14 కోట్లు వసూళ్లు రాబట్టుకొంది. ఇది ఏ రేంజ్ ఫ్లాపో చెప్పాల్సిన అవసరం లేదు కదా.
అక్షయ్ కుమార్ బ్యాడ్ లాక్ ని ప్రగ్యాకు కూడా అందించాడు. ఆమెకి తెలుగులో కూడా క్రేజ్ లేదు. హిందీలో కూడా అదృష్టం దక్కలేదు. ఆమె ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సరసన నటిస్తోంది.