ఊహించని విధంగా పవన్ కల్యాణ్ కు బెదిరింపు కాల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పేషీకి కాల్ చేసి బెదిరించారు. కేవలం కాల్స్ మాత్రమే కాదు.. చంపేస్తామంటూ కొన్ని సందేశాలు కూడా వచ్చాయి.
దీంతో వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది, పవన్ కల్యాణ్ కు విషయాన్ని వివరించారు. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన హోం శాఖ దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది.
పవన్ పేషీకి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు డీజీపీ నిర్థారించారు. త్వరలోనే వాళ్లను పట్టుకుంటామన్నారు. ఈమధ్య కాలంలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కాస్త ఎగ్రెసివ్ గా వెళ్తున్నారు. ఓ షిప్ ను సీజ్ చేస్తామంటూ హెచ్చరించారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఈ క్రమంలో చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. వీటిలో ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ‘ఓజీ’ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది.