
డిప్రెషన్.. చాలామందిని ఇబ్బంది పెడుతున్న అంశం. దీన్ని ఒక్కొక్కరు ఒక్కోలా డీల్ చేస్తారు. మరి డిప్రెషన్ లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ దీన్ని ఎలా డీల్ చేస్తారు? దీనికి ఆయన చెప్పే ఆన్సర్ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
“నేను డిప్రెషన్ ఫీల్ అవ్వను, నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే బతకడమే అద్భుతమైన విషయం అనిపిస్తుంది నాకు. అందుకే డిప్రెషన్ ఫీల్ అవ్వను. ఈ క్షణం బతికాం ఇది చాలు అనుకుంటాను.”
తన కొడుకు అకీరా నందన్, అప్పుడప్పుడు డిప్రెషన్ ఫీల్ అవుతుంటాడని, అలాంటప్పుడు ఒక పూట భోజనం మానేయమని వాడికి సలహా ఇస్తుంటానని చెప్పుకొచ్చారు పవన్. డిప్రెషన్ అనేది మైండ్ కు సంబంధించిన అంశమని, మనకు మనం సృష్టించుకున్న వ్యతిరేక భావన అని అన్నారు.
‘హరిహర వీరమల్లు’ సినిమాపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ ను పట్టించుకోవద్దంటున్నారు పవన్. మనం బలంగా ఉన్నాం కాబట్టి నెగెటివ్ కామెంట్స్ వస్తాయని అన్నారు.















