
రాజమౌళి లాంటి దర్శకుడు.. మరోవైపు మహేష్ బాబు లాంటి సినిమా.. పాన్ వరల్డ్ ప్రాజెక్టు.. ఇలాంటి ప్రాజెక్టు (#SSMB29)లో నటించడానికి ఎవరైనా ఓకే చెబుతారు. చాలామంది అలానే ఈ సినిమాలోకి వచ్చి ఉంటారు. కానీ తను మాత్రం ఆ టైపు కాదంటున్నారు పృధ్వీరాజ్ సుకుమారన్.
కథల ఎంపికలో తను చాలా ముక్కుసూటిగా ఉంటానని, అలా తిరస్కరించిన కథలు వందల్లో ఉన్నాయని స్పష్టం చేశాడు.
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో అద్భుతమైన కథ ఉందంటున్నాడు పృధ్వీరాజ్ సుకుమారన్. పైగా ఓ భారీ కథను ఎలా ప్రజెంట్ చేయాలో రాజమౌళికి బాగా తెలుసని, అందుకే ఈ ప్రాజెక్టులో నటించడానికి ఒప్పుకున్నట్టు వెల్లడించాడు. రాజమౌళి పేరు చూసి సినిమా ఒప్పుకోలేదని క్లారిటీ ఇచ్చారు.
మహేష్-రాజమౌళి సినిమాను ఓ దృశ్యకావ్యంగా చెప్పుకొస్తున్నాడు పృధ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమా ఓ విజువల్ ట్రీట్ గా ఉంటుందని, రాజమౌళి స్థాయిని మరింత పెంచుతుందని అంటున్నాడు.















