
24 గంటల గ్యాప్ లో విడుదలయ్యాయి ‘పట్టుదల’, ‘తండేల్’ సినిమాలు. ఎలాంటి ప్రచారం లేకుండా రిలీజైన పట్టుదల సినిమా ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోయింది. అదే టైమ్ లో భారీ ప్రచారంతో వచ్చిన ‘తండేల్’ సినిమా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది.
శనివారం నాటికి అజిత్ నటించిన ‘పట్టుదల’ పూర్తిగా పడిపోగా.. నాగచైతన్య ‘తండేల్’ పూర్తిస్థాయిలో పట్టు సాధించింది. సంక్రాంతి సినిమాల తర్వాత అంచనాలతో వచ్చిన మూవీగా ‘తండేల్’ నిలిచింది. పూర్తిగా కాకపోయినా, దాదాపు ఆ అంచనాల్ని అందుకోవడంలో సక్సెస్ అయింది.
‘పట్టుదల’ ఫ్లాప్ అవ్వడం, మార్కెట్లో మరో సినిమా లేకపోవడం ‘తండేల్’కు ప్లస్ గా మారింది. ఈ వీకెండ్ ముగిసేసరికి ‘తండేల్’ మంచి వసూళ్లు కళ్లజూసే అవకాశం ఉంది.
నాగచైతన్య-సాయిపల్లవి కాంబోలో తెరకెక్కింది ‘తండేల్’. చందు మొండేటి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.