కొన్ని రోజులుగా హాస్పిటల్ లో ఉన్న దిగ్గజ గాయని పి.సుశీల ఆరోగ్య పరిస్థితిపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని తన ఇంటికి చేరుకున్నారు.
వెంటనే ఆమె అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తను ఇంటికి చేరుకున్నానని, వైద్యులు తనను పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారని వెల్లడించారు. తన ఆరోగ్యంపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన ఆమె… తనను అభిమానించే వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కొన్ని రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు సుశీల. వెంటనే ఆమెను చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వైద్యులు ఆమెకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె వయసు 88 సంవత్సరాలు. వృద్ధాప్యం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు.
తన గాత్రంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు సుశీల. దాదాపు 10 భాషల్లో 45 వేలకు పైగా పాటలు పాడారు.