
ఎన్టీఆర్ ప్రస్తుతం టోక్యోలో ఉన్నారు. “దేవర” చిత్రం ఈ నెల 28న జపాన్ లో విడుదల అవుతోంది. ఆ మూవీ ప్రమోషన్ కోసం భార్యతో కలిసి టోక్యో వెళ్లారు ఎన్టీఆర్.
ఐతే, ఈ రోజు ఆయన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు. భార్యకి బర్త్ డే విషెష్ తెలుపుతూ రెండు ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు ఎన్టీఆర్. ఆ ఫోటోలు, ఆయన పెట్టిన మెసేజ్ క్షణాల్లో వైరల్ అయింది. తన భార్యని “అమ్ములు” అని పిలుస్తాడట ఎన్టీఆర్. ఆ పేరుతోనే ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు ‘దేవర’ కథానాయకుడు.
లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కి మరదలు అవుతుంది. తెలిసిన బంధువుల అమ్మాయి. ఐతే, పెళ్లి తర్వాత వీరి మధ్య బంధం పెరిగింది. మొదట్లో ఎన్టీఆర్ తన భార్య ఫోటోలు ఎక్కువగా షేర్ చేసేవాడు కాదు కానీ ఇటీవల ఫ్యామిలీ ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తున్నారు తన ఇన్ స్టాగ్రామ్ లో.
ALSO READ: NTR wishes his wife Lakshmi Pranathi on her birthday
ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతికి ఇద్దరు కొడుకులు. అభయ్, భార్గవ్ రామ్. కొడుకుల చదువులకు ఇబ్బంది కలగకుండా వీరు టూర్లు వేస్తుంటారు. ఈసారి టోక్యోకి పిల్లలు లేకుండానే వెళ్లారు ఈ జంట.
టోక్యో నుంచి వచ్చాక ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ ఎన్టీఆర్ బరువు తగ్గాలని ఇంతవరకు షూటింగ్ లో పాల్గొనలేదు. ఇప్పుడు చాలా బరువు తగ్గారు. టూ మచ్ స్లిమ్ అయ్యారు తారక్. సో, ఇక రాగానే షూటింగ్.