పుట్టిన రోజుకి ఐదు రోజుల ముందే ఎన్టీఆర్ వెకేషన్ కి వెళ్లిపోయారు. భార్య లక్ష్మి ప్రణతితో కలిసి విదేశాలకు వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్.
పుట్టిన రోజు (మే 20) వేడుకలు గ్రాండ్ గా జరుపుకొని ఈ రోజు హైద్రాబాద్ లో అడుగుపెట్టారు. బ్లాక్ ప్యాంట్, వైట్ టీ షర్ట్, డార్క్ గాగుల్స్ ధరించిన ఎన్టీఆర్ స్టైలిష్ గా కనిపించారు.
ఎన్టీఆర్ ఈ ఏడాది పలు సినిమాలతో బిజీ బిజీ. ఇప్పటికే “దేవర” సినిమా షూటింగ్ ని దాదాపు పూర్తి చేశారు. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే తన మొదటి బాలీవుడ్ మూవీ “వార్ 2” షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ షూటింగ్ తో పాటు “దేవర” చేస్తున్నారు. ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ లు పూర్తి అయిన తర్వాత ఆగస్టులోనే, సెప్టెంబర్ లోనో దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసే సినిమా మొదలుపెడతారు.
ఇలా వరుసగా మూడు సినిమాల షూటింగులు జరుగుతాయి. అందుకే భార్యతో కలిసి ఇలా లాంగ్ ట్రిప్పేశారు తారక్.
ఇక ఎన్టీఆర్ ప్రతి సినిమాలో తన గడ్డం లుక్ ని మైంటైన్ చేస్తారని టాక్.