ఈ వీకెండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ షురూ అవుతోంది. ఎన్ఠీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ చిత్రం… వార్ 2. ఈ షూటింగ్ లో పాల్గొనేందుకు ఈ రోజు (గురువారం) ముంబై వెళ్ళాడు. ముంబైలో ఎన్టీఆర్ కి ఘన స్వాగతం లభించింది.
ట్రిమ్ చేసిన గడ్డం, క్యాప్ పెట్టుకొని ఎన్టీఆర్ మ్యాన్లీ లుక్ లో అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక స్పై ఏజెంట్ గా నటిస్తున్నాడు.
హృతిక్ రోషన్ ఈ సినిమాలో మెయిన్ హీరో. మొదటి భాగం “వార్”లో కూడా హృతిక్ రోషన్ హీరో. ఇప్పుడు రెండో హీరోగా ఎన్టీఆర్ వచ్చి చేరారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తారు అని మొదట అనుకున్నారు. కానీ ఆయనది హీరో పాత్రేనంట. హృతిక్, ఎన్టీఆర్ మధ్య తీసే యాక్షన్ సీన్లు ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రానంత గొప్పగా ఉంటాయని అంటున్నారు.
“ఆర్ ఆర్ ఆర్” సినిమాతో ఇప్పటికే నార్త్ ఇండియన్ మార్కెట్ లో కూడా ఎన్టీఆర్ కి క్రేజ్ వచ్చింది. “ఆర్ ఆర్ ఆర్”లోని “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తారక్ పేరు గ్లోబల్ రేంజ్ కి చేరుకొంది. త్వరలో విడుదల కానున్న “దేవర” సినిమాని హిందీ మార్కెట్ లోకి కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. దాంతో ఎన్టీఆర్ కి హిందీలో మార్కెట్ మరింత పెరుగుతుంది. దానికి తోడు ఇప్పుడు డైరెక్ట్ గా హృతిక్ రోషన్ తో కలిసి ఒక బాలీవుడ్ బిగ్ సినిమాలో నటిస్తున్నాడు. సో, ఎన్టీఆర్ పూర్తిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయినట్లే.
వార్ 2’లో ఎన్టీఆర్ సరసన ఎవరు?
అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బాలీవుడ్ అగ్ర నిర్మాత ఆదిత్య చోప్రాకి చెందిన యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. హృతిక్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు అనేది ఇంకా ఖరారు కాలేదు.
“వార్ 2” సినిమాని వచ్చే ఏడాది విడుదల చేస్తారు.