
సినిమా థియేటర్ టికెట్ రేట్లు కన్నా మల్టిప్లెక్స్ లలో పాప్ కార్న్, వాటర్ బాటిల్, కాఫీ రేట్లు ఎక్కువ భయపెడుతున్నాయి జనాలని. పీవీఆర్ వంటి మల్టిప్లెక్స్ లలో కాఫీ రేట్ 300 రూపాయలు. పాప్ కార్న్ 350, 400 రూపాయలు. నీళ్లు తాగాలన్న 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే.
అందుకే, ఫ్యామిలీ ఆడియెన్స్ థియటర్లకు వెళ్లడం తగ్గింది. నలుగురు ఉన్న ఫ్యామిలీ సినిమాకి వెళ్తే 1000 రూపాయలు టికెట్లకు ఐతే పాప్ కార్న్, వాటర్ కి మరో వెయ్యి సమర్పించాలి. అందుకే ఇప్పుడు వీటిని తగ్గించాలనే డిమాండ్ మొదలైంది.
మొదటిసారిగా ఒక హీరో ఈ విషయంలో గట్టిగా తన గొంతు విప్పారు. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్… థియేటర్లలో ఈ ధరలు తగ్గకపోతే సినిమా పరిశ్రమ మనుగడకే సమస్య అని గుర్తించిన నిఖిల్ ఇండస్ట్రీ అంతా స్పందించి తగు చర్యలు తీసుకోవాలి అని అంటున్నారు.
అంతే కాదు, మన వాటర్ బాటిల్ ని మనమే థియేటర్లోకి తీసుకెళ్దాం. వాటర్ బాటిల్ ని తీసుకెళ్లడాన్ని మల్టిప్లెక్స్ లు ఆపొద్దని నిఖిల్ అంటున్నారు. అతని వాదన సబబుగానే ఉంది కదా.
నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం “ఇండియా హౌస్”, “స్వయంభు” వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. రెండూ పాన్ ఇండియన్ చిత్రాలే.















