హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. ఒకే రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 పెద్ద సినిమాల షూటింగ్స్ చేస్తున్నట్టు వెల్లడించింది.
“ఆర్టిస్ట్ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మాత్రం నిజంగా గొప్పగా అనిపిస్తాయి. ఎంతో అదృష్టం ఉండాలి. ఒకే రోజు 2 పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాను. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంటే, ఇంకోటి తెలంగాణలో నడుస్తోంది. ఒకే రోజు 2 రాష్ట్రాల్లో 2 సినిమాలు. ఈ రెండు సినిమాల్ని మీకు చూపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే పండగ వస్తోంది.”
“హరిహర వీరమల్లు”, “రాజాసాబ్” సినిమాల్ని ఉద్దేశించి నిధి అగర్వాల్ ఈ పోస్ట్ పెట్టింది. విజయవాడ సమీపంలో వేసిన సెట్ లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది నిధి. ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే హైదరాబాద్ లో “రాజాసాబ్” షూట్ లొకేషన్ లో జాయిన్ అయింది.
మొన్నటివరకు ఈమె కేవలం “రాజాసాబ్” షూట్ లో మాత్రమే పాల్గొంది. ఎప్పుడైతే “హరిహర వీరమల్లు” సినిమా సెట్స్ పైకి వచ్చిందో, ఒక్కసారిగా బిజీ అయింది.
ఆమె అంకితభావానికి మారుతి లాంటి వాళ్లు ఫిదా అవుతున్నారు.