
నయనతార మళ్ళీ తెలుగులోకి అడుగుపెడుతోంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె ఒక తెలుగు సినిమా ఒప్పుకొంది. ఆమె నటిస్తోన్న కొత్త చిత్రం చిరంజీవి సరసన. “సైరా” తర్వాత మరోసారి చిరంజీవికి భార్యగా నటిస్తోంది నయనతార.
ఈ సినిమాకి నయనతార మొదట భారీ పారితోషికం కోట్ చేసింది. కానీ ఆమె అడిగినంత మొత్తం ఇవ్వలేమని, అంత మొత్తం ఇస్తే ఈ సినిమాకి వర్కవుట్ కాదని మేకర్స్ ఆమెకి తెగేసి చెప్పారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియన్ చిత్రం కాదు. పక్కా లోకల్ తెలుగు చిత్రం. అదీ కూడా సంక్రాంతి విడుదలకి టార్గెట్ చేసి తీస్తున్న మూవీ. అందుకే, తక్కువ టైంలో తీసే సినిమా. మీ టైం ఎక్కువ వేస్ట్ కాదు కాబట్టి అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది టీం.
దాంతో, నయనతార తన పారితోషికాన్ని భారీగా తగ్గించింది. అంతేకాదు వెంటనే డేట్స్ ఇచ్చింది. జూన్ నుంచి షూటింగ్ మొదలు కానుంది. నయనతార కూడా అదే టైంలో షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందే ఈ సినిమాలో చిరంజీవి హీరో, వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. క్యాథరిన్ ట్రెసా మరో హీరోయిన్.