
ప్రతి హీరోకు మరో హీరోతో వింటేజ్ మూమెంట్ ఉంది. ఆది పినిశెట్టికి కూడా బాలకృష్ణతో అలాంటి మూమెంట్ ఒకటి ఉంది. స్వయంగా ఈ నటుడు, ఆ మేటర్ ను బయటపెట్టాడు.
బాలకృష్ణను తొలిసారి “బంగారు బుల్లోడు” సెట్స్ లో కలిశాడంట ఆది పినిశెట్టి. అప్పుడు తను చాలా చిన్నవాడినని, తండ్రితో కలిసి సెట్స్ కు వెళ్లానని చెప్పుకొచ్చాడు. తను చిన్నప్పుడు బాలయ్యలో చూసిన ఎనర్జీ, ఇప్పటికీ అలానే ఉందంటున్నాడు ఆది.
కెరీర్ లో ఫస్ట్ టైమ్ బాలకృష్ణతో కలిసి ‘అఖండ-2’ సినిమా చేస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. బాలయ్యతో కలిసి నటించడం చాలా బాగుందని, ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకొచ్చాడు ఆది.
ఇక ‘అఖండ-2’ విషయానికొస్తే, ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేశాడట ఆది పినిశెట్టి. త్వరలోనే తన షెడ్యూల్ ఉందని స్పష్టం చేశాడు. ‘ది వారియర్’ సినిమా తర్వాత ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న మూవీ ఇదే.