
వైజాగ్ ప్రేక్షకులకు నాగచైతన్య ప్రత్యేక విన్నపం చేశాడు. తన పరువు కాపాడాలంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇంతకీ అసలు మేటర్ ఏంటో చూద్దాం..
నాగచైతన్య భార్య శోభితది విశాఖపట్నం. అలా తను వైజాగ్ పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ప్రస్తుతం తన ఇంట్లో పెద్ద వైజాగ్ ఉందని, డామినేషన్ కూడా వైజాగ్ దేనని అన్నాడు చైతూ. కాబట్టి తండేల్ సినిమాను విశాఖపట్నంలో పెద్ద హిట్ చేసి, ఇంట్లో తన పరువు కాపాడాలని కోరుతున్నాడు.
వైజాగ్ లో తండేల్ థియేట్రికల్ ట్రయిలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇలా సరదాగా మాట్లాడాడు నాగచైతన్య. వైజాగ్ అంటే తనకు ప్రత్యేకమైన సెంటిమెంట్ కూడా ఉందని అంటున్నాడు.
తన సినిమా ఏది రిలీజైనా ముందుగా వైజాగ్ టాక్ కనుక్కుంటాడట. వైజాగ్ లో సినిమా హిట్టయితే, ప్రపంచంలో ఎక్కడైనా ఆ సినిమా సక్సెస్ అవుతుందని అంటున్నాడు నాగచైతన్య.