చిరంజీవి-బాలకృష్ణ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? రజనీకాంత్-కమల్ హాసన్ కలిసి ఓ మూవీలో నటిస్తే ఎలా ఉంటుంది? ఈ కాంబినేషన్ కూడా అలాంటిదే. మలయాళ దిగ్గజ నటులు మోహన్ లాల్, మమ్ముట్టి కలిశారు. సినిమా ప్రారంభించారు.
మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి సినిమా స్టార్ట్ చేయడంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఆసక్తి పెరిగింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి చేస్తున్న సినిమా ఇది.
మహేష్ నారాయణన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో మొదలైంది. ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కుంచకో బోబన్, ఫహాజ్ ఫాజిల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు.
అందుకే మలయాళంలో ఇది మెగాప్రాజెక్టుగా మారింది. మమ్ముట్టికి కెరీర్ లో ఇది 429వ చిత్రం. స్పై-యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోంది ఈ మూవీ. ఇందులో మమ్ముట్టి వయసుమళ్లిన పాత్రలో కనిపించబోతుండగా.. కాస్త పెద్దగా ఉండే అతిథి పాత్రలో మోహన్ లాల్ కనిపించబోతున్నారు. 2008లో వీళ్లిద్దరూ కలిసి ‘ట్వంటీ-ట్వంటీ’ అనే సినిమా చేశారు.