హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఆదివారం ఉదయం చెన్నైలోని ఓ రిసార్ట్ లో మేఘా ఆకాశ్, సాయి విష్ణు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అంతకంటే ముందు ఈ జంట ఇచ్చిన వెడ్డింగ్ రిసెప్షన్ కు భారీ ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా హాజరై, వధూవరుల్ని ఆశీర్వదించారు.
తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ లీడర్ కొడుకు సాయి విష్ణు, మేఘా ఆకాష్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రీసెంట్ గా తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి, పెళ్లికి ఒప్పించారు. అలా ఇరు కుటుంబాల అంగీకారంతో వీళ్లు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారు.
పెళ్లికి ముందు తన స్నేహితులకు గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది మేఘా ఆకాష్. అందర్నీ శ్రీలంకకు తీసుకెళ్లింది. ఆ ఫొటోల్ని కూడా ఆమె షేర్ చేసింది.
తెలుగులో ఆమె ప్రామిసింగ్ సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. శ్రీవిష్ణుతో చేసిన ‘రాజరాజ చోర’ సినిమా మాత్రమే ఆమెకు ఉన్నంతలో కలిసొచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా ఫ్లాపులే. అలా 28 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైంది మేఘా ఆకాష్.