“నేను ప్రస్తుతం ఏ పార్టీలో లేను. పార్టీలకు సంబంధంలేని వ్యక్తిని”
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన కామెంట్. పద్మవిభూషణ్ పురస్కారం అందుకొని హైదరాబాద్ వచ్చిన మెగాస్టార్ మీడియాతో ముచ్చటిస్తూ తాను రాజకీయాల్లో లేను, రాజకీయాలకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు.
పైకి ఎన్ని చెప్పినా చిరంజీవి కుటుంబం మొత్తం రాజకీయాలతో మమేకం అయింది. వీడియో బైట్లు లేదు ఇంటర్వ్యూలు లేదా సోషల్ మీడియా పోస్టుల ద్వారా చిరంజీవి ప్రస్తుతం కింది పార్టీల అభ్యర్థుల విజయం కోరారు.
జనసేన
పవన్ కళ్యాణ్
పంచకర్ల రమేష్ బాబు
బీజేపీ
సీఎం రమేష్ (ఆంధ్రప్రదేశ్)
కొండా విశ్వేశ్వరరెడ్డి (తెలంగాణ)
కిషన్ రెడ్డి (తెలంగాణ)
ఇక రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు.
అల్లు అర్జున్ తమ కుటుంబ హీరో, జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అంతే కాదు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ప్రచారం చివరి రోజు తన భార్య స్నేహతో కలిసి నంద్యాల వెళ్లి అక్కడ పోటీ చేస్తున్న తమ మిత్రుడు వైఎస్సార్సీ పార్టీ అభ్యర్థి రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపారు. అల్లు అర్జున్ సొంత మామ (స్నేహ తండ్రి) ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నారు.
మొత్తం మెగా ఫ్యామిలీ రాజకీయపార్టీలతో, రాజకీయనాయకులతో మమేకమై ఉంది. ఓవరాల్ గా ఎన్నికల్లో వీళ్ళ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ లో జనసేన-బీజేపీ-తెలుగుదేశం కూటమి వైపు పూర్తిగా మొగ్గింది. అల్లు అర్జున్ ఒక్క వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం వెళ్లారు. ఇటు తెలంగాణాలో వారి కుటుంబం మొత్తం బీజేపీ వైపు మోహరించింది. కాంగ్రెస్ కి కూడా అనుకూలంగానే ఉంటోంది.