
మజాకా టీజర్ రిలీజైంది. సందీప్ కిషన్, రావు రమేష్ కలిసి పంచ్ లతో హోరెత్తించారు. టీజర్ చాలా బాగుంది. అయితే ఇది చిరంజీవి చేయాల్సిన సినిమా అనే విషయం ఎంతమందికి తెలుసు?
అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను చిరంజీవి చేయాలి. సినిమాలో రావు రమేష్ పోషించిన పాత్రలో చిరంజీవి కనిపించాలి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ప్రాజెక్టు లాక్ అవ్వలేదు.
“ముందు రావు రమేష్ ను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నాను. పూర్తిగా డైలాగ్ వెర్షన్ కూడా అయిపోయిన తర్వాత, ఈ కథ చిరంజీవికి బాగుంటుందని చెప్పి, ఓ ఫ్రెండ్ నన్ను అక్కడకు తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల చిరంజీవితో చేయడం కుదరలేదు. ఫైనల్ గా ఎక్కడ మొదలుపెట్టామో మళ్లీ అక్కడికే వచ్చాం.”
రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ చెప్పిన మేటర్ ఇది. చిరంజీవి చేస్తే ఈ ప్రాజెక్ట్ నెక్ట్స్ లెవెల్ లో ఉండేదని, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా సెట్ అవ్వలేదని అన్నాడు.
ALSO READ: మహిళలందరికీ నక్కిన సారీ
అప్పట్లో చిరంజీవి, సిద్ధు జొన్నలగడ్డ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కాకపోతే అదే టైమ్ లో చిరంజీవి నటించిన భోళాశఁకర్ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఈ ప్రాజెక్టుతో పాటు, వెంకీ కుడుముల, కల్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమాల్ని చిరంజీవి పక్కనపెట్టారని అంటారు.