
మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ (బూతులు) తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. రంకెలు వేసుకున్నారు. ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు. వారి ఇంటి బాగోతం జాతీయస్థాయిలో వార్త అయింది. ఆస్తుల గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. మనోజ్ కి చిల్లిగివ్వ ఇవ్వను అని మోహన్ బాబు ఆ మధ్య గట్టిగా చెప్పారు.
ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది.
ఐతే ఈ రోజు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మనోజ్ ట్విట్టర్ వేదికగా తండ్రికి శుభాకాంక్షలు తెలపడం విశేషం. “పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. మీతో ఉండి సంబరాలు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. మీతో కలిసి ఉండే క్షణాల కోసం వేచి చేస్తున్నా,” అని పోస్ట్ చేశాడు.
మరీ పబ్లిక్ గా తిట్టుకున్న ఈ తండ్రీకొడుకులు మళ్ళీ ఎప్పుడు కలుస్తారో? ఫ్యామిలీ ఫోజు ఎప్పుడిస్తారో?
మరోవైపు, మోహన్ బాబు పుట్టిన రోజు (మార్చ్ 19) సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి మహాదేవ శాస్త్రిని పరిచయం చేశారు. ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. మంచు విష్ణు కన్నప్పగా నటిస్తుండగా, మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్ర పోషిస్తున్నారు.