
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. దానికి కారణం అందులో ప్రభాస్ హీరోగా నటించడమే. ఈ సంగతి పక్కనపెడితే, మొదటి రోజుకే ఇండస్ట్రీ హిట్ అనే పోస్టర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
కన్నప్ప పోస్టర్ పై ఇండస్ట్రీ హిట్ అని వేయడం చాలామందికి కోపం తెప్పించింది. ఇదే సినిమాలో నటించిన ప్రభాస్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు. అలా మొదటి రోజే ఇండస్ట్రీ హిట్ పోస్టర్ తో హల్ చల్ చేసిన ఈ సినిమా, సరిగ్గా వారం తిరిగేసరికి థియేటర్లలో ఆక్యుపెన్సీ లేక కిందామీద పడుతోంది.
రేపటితో రెండు వీకెండ్ ల రన్ పూర్తిచేసుకుంటుంది కన్నప్ప సినిమా. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు చూస్తే గ్రాస్ 50 కోట్లు కూడా టచ్ చేసింది. సినిమాకి అయిన బడ్జెట్ చాలా ఎక్కువ. మంచు విష్ణు చెప్పిన లెక్కల ప్రకారమే చూసుకుంటే, సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం అసంభవం.
నిజానికి రిలీజైన తర్వాత మొదటి సోమవారం నుంచే కన్నప్ప డ్రాప్ అయింది. అప్పట్నుంచి ఈరోజు వరకు సినిమా లేవలేదు.