మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడిగా మంచు విష్ణు రెండో సారి కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇంతకీ మా ప్రెసిడెంట్ గా ఏమి సాధించాడు అంటే ఏమి లేదు అని చెప్పాలి. “మా”కి బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పి ఎన్నికయ్యిన విష్ణు ఆ ఊసే మర్చిపోయాడు. అది ఇప్పుడు అసాధ్యం అని చెప్పాలి. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మోహన్ బాబు ఫ్యామిలీకి చుక్కలు చూపించాడు. ఇక బిల్డింగ్ కి స్థలం ఇస్తారని అనుకోలేం.
తాజాగా ఇండస్ట్రీ పెద్దలు కొందరు ఈ రోజు రేవంత్ రెడ్డిని వెళ్లి కలిశారు. కానీ “మా” ప్రెసిడెంట్ అయిన విష్ణుకి పిలుపు రాలేదు. ఎవరూ పట్టించుకోలేదు. కానీ అందరితో పాటు తాను కూడా ట్వీట్ వేశారు. తెలుగు సినిమా అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయంటూ విష్ణు ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు.
అంతే, సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. “మా” సభ్యులు కొందరు వెళ్లి రేవంత్ ని కలిశారు సరే కానీ అధ్యక్షుడి అయి ఉండి మీరు ఎందుకు వెళ్ళలేదు అన్న అంటూ ట్రోలింగ్ చేశారు.
విష్ణు ట్విట్టర్ పోస్ట్ కన్నా ఆయన పోస్ట్ కి వచ్చే కామెంట్స్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఇటీవల వారి కుటుంబ సమస్య వివాదం కావడంతో ఇప్పుడు విష్ణుని మరింతగా జనం ఆడుకుంటున్నారు.