మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి ఇటీవలే దుబాయిలో స్టోరీ డిస్కషన్స్ జరిపారు. ఐతే దుబాయిలో వరదల కారణంగా వెంటనే హైదరాబాద్ విచ్చేశారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం దాదాపు రెండేళ్లు పని చెయ్యాలి.
రాజమౌళి సినిమా చేస్తున్నప్పుడు తన గెటప్ ని జనాలకు చూపించకుండా జాగ్రత్త పడాలి. ఐతే, మహేష్ బాబు మాత్రం తన యాడ్స్, ఆ యాడ్ షూటింగ్ లు ఆపే ఆలోచనలో లేనట్లు కనిపిస్తోంది. వరుసగా కొత్త బ్రాండ్స్ ఒప్పుకుంటున్నారు.
దుబాయ్ నుంచి హైదరాబాద్ కి రాగానే “SRH” ఐపీఎల్ టీంతో కలిసి ఒక యాడ్ చేశాడు. ఆ టీంకి చెందిన పాట్ కమ్మిన్స్ మహేష్ బాబుతో షూటింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజమౌళి సినిమా మొదలయ్యేంతవరకు ఇలాగే యాడ్స్ షూటింగ్ లతో బిజీగా ఉండేలా ఉన్నారు.
మరోవైపు, రాజమౌళి – మహేష్ బాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో స్టార్ట్ అవుతుంది.