కాజల్ అగర్వాల్ నటించిన రెండు చిత్రాలు కేవలం నెల గ్యాప్ లో విడుదల కానున్నాయి. ఒకటి “సత్యభామ”, మరోటి “భారతీయుడు 2”.
“సత్యభామ” సినిమా వచ్చే నెల విడుదల కానుంది. మే 17న విడుదల చేస్తామని తాజాగా నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో ఆమె హీరో, హీరోయిన్. ఇందులో ఆమె ఒక పోలీస్ అధికారిణిగా నటిస్తున్నారు.
ఇక “భారతీయుడు 2” చిత్రంలో ఆమె కమల్ హాసన్ సరసన నటించారు. ఈ సినిమాకి ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు కానీ జూన్ రెండో వారంలో రానుంది అని సమాచారం. ఈ సినిమా కోసం ఆమె కలారిపయట్టు విద్య కూడా నేర్చుకొంది. ఒక మూవీ హీరోయిన్ ఓరియేంటేడ్ చిత్రం కాగా మరోటి పాన్ ఇండియన్ బిగ్ మూవీ. ఈ రెండూ ఆడితే ఆమెకి మళ్ళీ క్రేజ్ పెరగడం ఖాయం.
మరోవైపు, ఈ రెండు సినిమాలు విడుదల అవుతున్న వేళ కాజల్ ఒక హాట్ హాట్ ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. రెండేళ్ల బాబుకి ఆమె ఆమె తల్లి. కొడుకు పుట్టిన తర్వాత ఆమె ఇంత హాట్ గా ఫోటో షూట్ చెయ్యడంతో రకరకాల కామెంట్స్ పడుతున్నాయి.
Click Here For More Photos of Kajal Aggarwal
ఐతే ఆమె గ్లామర్ షోకి రెడీ అని హింట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తల్లి అయినంత మాత్రాన తన అందాలు తగ్గలేదు అని చెప్తున్నట్లు ఉంది.