
పుష్పక విమానం లాంటి టాలీవుడ్ లోకి నిత్యం టాలెంట్ వస్తూ ఉంటుంది. అయితే అందులో కొంతమంది మాత్రమే ప్రేక్షకుల్ని ఓ రకమైన షాక్ కు గురిచేస్తారు. అలాంటి షాకింగ్ టాలెంట్ మధుసూదన్ కోట. ‘బందీ’ అనే సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు కోట. సినిమాలో అతడి వర్క్ చూసి అంతా ఫిదా అయ్యారు. పలు సినిమా ఫెస్టివల్లో “బందీ” ప్రదర్శింపబడింది. ప్రశంసలు అందుకొంది.
ఆదిత్య ఓం హీరోగా నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ లో కేవలం ఒకే ఒక్క పాత్ర ఉంది. మూవీలో ఒకే క్యారెక్టర్ ఉందనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగలేదంటే దానికి కారణం మధుసూదన్ సినిమాటోగ్రఫీ. తన అద్భుతమైన ఫ్రేమ్స్, కలర్ స్కీమ్ తో ప్రేక్షకుల్ని థియేటర్లలో బందీల్ని చేశాడు మధుసూదన్.
సినిమాలో ఇతడు ఉపయోగించిన టెక్నిక్స్, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ ను సైతం ఆకట్టుకున్నాయి. అతడు పెట్టిన ఫ్రేమ్స్, ఫీల్డ్ డెప్త్, ఆదిత్య ఓం ఎమోషన్స్ ను క్యాప్చూర్ చేసిన విధానాన్ని ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. అందుకే అతడ్ని ఎన్నో అవార్డులు వరించాయి. సినిమాటోగ్రఫీతో కేవలం ఫ్రేమలు పెట్టడమే కాకుండా, ఎమోషన్స్ కూడా పండించొచ్చని, టెన్షన్ ను కూడా క్రియేట్ చేయొచ్చని, మొత్తంగా కథను నడిపించొచ్చని నిరూపించాడు మధుసూధన్ కోట.
కోటా ఫ్రేమింగ్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ప్రత్యేకం. అందుకే సింగిల్ క్యారెక్టర్ ఉన్నా రక్తి కట్టించగలిగాడు. ప్రేక్షకులు కథానాయకుడి ప్రయాణంలో భావోద్వేగపరంగా నిమగ్నమై ఉండేలా చూసుకున్నాడు.కథానాయకుడి భావోద్వేగలను ప్రస్ఫుటంగా చూపడానికి క్లోజప్లను సృజనాత్మకముగా ఉపయోగించారు.