
జాన్వీ కపూర్ కూడా సినిమా ఇండస్టీలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లో ఒక మూవీలో నటించింది. అది నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ప్రస్తుతం మరో రెండు చిత్రాలు బాలీవుడ్ లో లైన్ లో ఉన్నాయి.
అక్కలా చెల్లెలు ఖుషి ఇంకా పాపులారిటీ తెచ్చుకోలేదు. కానీ బ్రాండ్స్ తో ఇన్ స్టాగ్రామ్ తో సంపాదన బాగానే ఉంది ఈ బ్యూటీకి. అందుకే, సొంతంగా ఒక ఖరీదైన కారు కొనుక్కొంది. మెర్సిడెస్ బ్రాండ్ కి చెందిన ఒక కారు ఆమె కొనుగోలు చేసింది. దాని ఖరీదు మూడు కోట్లు (3 కోట్ల రూపాయలు).
వ్యాగన్ కారు ఇది. రెడ్ కలర్ కారుని ఆమె ఒక పార్క్ చేసి ఉంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక్క సినిమాలో నటించే ఇంత సంపాదించిందా అని కామెంట్స్ పడుతున్నాయి.
సినిమాల్లో నటించినా నటించకపోయినా ఆమె రిచ్. తల్లి ద్వారా, తండ్రి ద్వారా బోలేడంతా వస్తుంది ఆమెకి. ఇక సోదరి జాన్వీ కపూర్ కూడా పెద్ద హీరోయిన్. సో, ఏ విధంగా చూసినా ఆమె మెర్సెడిస్ కారు కొనడం పెద్ద విశేషం కాదు. కానీ ఆమె సొంతంగా కొనుక్కొంది అన్న విషయంలోనే ఈ చర్చ జరుగుతోంది.