
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ‘డాన్-3’ నుంచి ఆమె తప్పుకుందనే ప్రచారం ఊపందుకుంది.
రణ్వీర్ హీరోగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో కియరా అద్వానీ స్థానంలో కృతి సనన్ ను తీసుకున్నట్టు ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం రోజురోజుకు ఊపందుకోవడంతో మేకర్స్ అలర్ట్ అయ్యారు. క్లారిటీ ఇచ్చారు.
‘డాన్-3’ కోసం కృతి సనన్ ను తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది యూనిట్. ముందుగా అనుకున్నట్టు కియరాకే ఫిక్స్ అయినట్టు తెలిపింది. కియరా కోసం సినిమా షూటింగ్ డేట్స్ ను కూడా సర్దుబాటు చేసుకున్నట్టు యూనిట్ వెల్లడించింది.
ఈ ప్రాజెక్టును 2026 జనవరిలో సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. ఈలోగా బిడ్డకు జన్మనిచ్చి, తిరిగి సినిమాలకు సిద్ధమౌతుంది కియరా.