
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది మద్రాసు హైకోర్టు. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది.
ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో దొరికిపోయాడు శ్రీరామ్. ఓ పబ్ లో జరిగిన గొడవలో కృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా.. విచారణ భాగంగా అతడు శ్రీరామ్ పేరు చెప్పాడు. శ్రీరామ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.
తను కొకైన్ తీసుకున్నట్టు శ్రీరామ్ అంగీకరించాడు. దీంతో అతడ్ని అరెస్ట్ చేశాడు. కృష్ణకు లక్షల రూపాయలు చెల్లించి కొకైన్ కొన్నాడు శ్రీరామ్. కొన్ని ఆన్ లైన్ పేమెంట్స్ కూడా చేయడంతో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
ఈ కేసులో పూర్తిస్థాయిలో సాక్ష్యాలు సేకరించే పనిలో పడింది దర్యాప్తు సంస్థ. అయితే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇన్ వాల్వ్ అయిన కేసు కావడంతో, ఇది ఎంత ముందుకెళ్తుందనేది అనుమానాస్పదంగా మారింది.