
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్ చేసింది. అయితే ఈ లిస్ట్ లో ఓ దర్శకుడు కూడా ఉన్నాడు. అతడే వెంకీ అట్లూరి.
కీర్తి సురేష్ కు పెళ్లయిపోయినందుకు ఈ దర్శకుడు చాలా బాధపడ్డాడు. అలా అని కీర్తిసురేష్ ను అతడు ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలని అస్సలు అనుకోలేదు. దానికి వేరే రీజన్ ఉంది.
కీర్తిసురేష్ తో ‘రంగ్ దే’ అనే సినిమా చేశాడు వెంకీ అట్లూరి. ఆ సినిమా టైమ్ లో వీళ్లిద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు. ఎంతలా అంటే, కీర్తిసురేష్ తో ప్రతిది షేర్ చేసుకునేవాడంట అట్లూరి. సినిమా రిలీజ్ తర్వాత కూడా ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారంట.
ఓ క్లోజ్ ఫ్రెండ్ గా మారిపోయిందంట కీర్తి సురేష్. అలాంటి అమ్మాయి సెడన్ గా పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో తట్టుకోలేకపోయానన్నాడు వెంకీ అట్లూరి. ఒకప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కీర్తితో మాట్లాడేవాడినని, ఇప్పుడు ఆమెకు పెళ్లయిందని, ఎంత క్లోజ్ అయినప్పటికీ ఇప్పుడు సమయం-సందర్భం లేకుండా కాల్స్ చేస్తే బాగోదని అన్నాడు.