వచ్చే నెల్లోనే ‘కన్నప్ప’ సినిమా థియేటర్లలోకి రావాలి. కానీ ఇప్పుడీ సినిమా విడుదల తేదీ మారింది. డిసెంబర్ లో ‘కన్నప్ప’ సినిమా రావడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా హీరో-నిర్మాత మంచు విష్ణు ప్రకటించాడు.
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న విష్ణు.. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ.. కన్నప్ప విడుదల తేదీపై స్పందించాడు.
“డిసెంబర్ లో రిలీజ్ అనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల రావడం లేదు. 2025 సమ్మర్ కు షిఫ్ట్ చేశాం. ఏ నెలలో రిలీజ్ అనేది త్వరలోనే ఎనౌన్స్ చేస్తాం.” అంటూ తాజా అప్ డేట్ అందించాడు.
ఈ సినిమా నుంచి మంచు విష్ణుతో పాటు చాలామంది నటీనటుల లుక్స్ ఇప్పటికే రిలీజయ్యాయి. ప్రభాస్ లుక్ మాత్రం పెండింగ్ లో ఉంది. ఓ మంచి రోజు చూసి అది రిలీజ్ చేద్దామనుకున్న టైమ్ లో ఆ లుక్ లీక్ అయింది. ఓవైపు ఇలా లీకుల బారిన ఈ సినిమా, ఇప్పుడు వాయిదా పడింది. గ్రాఫిక్ వర్క్ సకాలంలో పూర్తవ్వకపోవడం వల్లనే కన్నప్ప సినిమా పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది.