దీపావళికి విడుదలైన “లక్కీ భాస్కర్”తో ప్రేక్షకులను అలరించింది మీనాక్షి చౌదరి. ఇప్పుడు ‘మట్కా’తో మరోసారి మన ముందుకు. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానున్న సందర్భంగా ఈ బ్యూటీతో ముచ్చట్లు.
‘మట్కా’లో సుజాతగా
“మట్కా” కథ 40 ఏళ్ల క్రితం నేపథ్యంగా ఉంటుంది. నా పాత్ర పేరు సుజాత. హీరోగా నటించిన వరుణ్ తేజ్ వాసు పాత్రతో నా కథ ఆసాంతం సాగుతుంది. వాసు జీవితంలో ఒక వెలుగు ఆమె.
నా పాత్రలో కూడా వివిధ దశలు ఉంటాయి.. టీనేజ్ లో ఒకలా కనిపిస్టేను .. ఆ తర్వాత మరో రకంగా. పాత్ర జీవితంలోని వివిధ దశలు మారుతున్న కొద్దీ నా లుక్ లో మార్పు కన్పిస్తుంది. దర్శకుడు కరుణ కుమార్ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ అన్ని విషయాల్లో ఆయన ఆలోచనలకు అనుగుణంగా నేను మలుచుకున్నాను. ఈ పాత్ర చాలా నచ్చింది.
కష్టం
ఈ పాత్ర నిజంగానే ఒక ఛాలెంజ్. చాలా హోంవర్క్ చేశాను. “లక్కీ భాస్కర్”లో కూడా 30 ఏళ్ల క్రితం అమ్మాయి పాత్ర పోషించాను. కానీ ఈ పాత్రలో చాలా షేడ్స్, దశలు ఉన్నాయి. అందుకే ఎక్కువ కష్టపడ్డాను.
వరుణ్ తేజ్ తో నటనవరుణ్ తేజ్ మంచి మనిషి. హీరోగా కూల్ గా ఉంటారు. సెట్ లో చాలా హెల్ప్ ఫుల్ గా వుంటారు. ఆయనకి సినిమా గురించి చాలా నాలెడ్జ్ ఉంది. వాసు క్యారెక్టర్ లో అద్భుతంగా నటించారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. మా కాంబినేషన్లో ఒక సాంగ్ ఉంది.
అన్ని రకాల పాత్రలు
ఇలాంటి కథలే చెయ్యాలి… ఇలాంటి జోనర్స్ లో సినిమాలు మాత్రమే చెయ్యాలి అని గిరిగీసుకోలేదు. కథ బాగుంటే అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ షూటింగ్ లో ఉన్నాను.