“విక్రమ్” సినిమాతో సోలో హిట్ కొట్టారు కమల్ హాసన్. కానీ ఆ తర్వాత ఆయన ఎంచుకున్న రెండు సినిమాలు చర్చనీయాంశంగా మారాయి. ఉదాహరణకు “కల్కి” సినిమానే తీసుకుంటే, అందులో ప్రభాస్ హీరో, కమల్ స్క్రీన్ టైమ్ చాలా తక్కువ.
ఇక భారతీయుడు-2 సినిమా విషయానికొస్తే, ఈ సినిమాలో కూడా చాలా భాగం సిద్దార్థ్ కనిపిస్తాడనే టాక్ నడుస్తోంది. ఆ తర్వాత మాత్రమే కమల్ హాసన్ సీన్ లోకి వస్తారని, సినిమా అంతా ఆయన కనిపించరనే బజ్ నడుస్తోంది.
దీనిపై కమల్ స్పందించారు. తనకు లెంగ్త్ ఇంపార్టెంట్ కాదంటున్నారు. తనను కొత్తగా చూపించే పాత్రలు దొరికితే చాలంటున్నారు.
“ఎవడు ఈ కమల్ హాసన్ అని నేను అడుగుతున్నాను. కమల్ హాసన్ అనే వ్యక్తిని మీరు చూడకండి. నా పాత్రను చూడండి. సినిమా అంతా నేను ఉంటే ఆడుతుందా.. సినిమా ముఖ్యం. భారతీయుడు-2లో నేను సేనాపతిగా చేశాను. పాటలు కావాలని అడగలేను కదా. లెంగ్త్ మేటర్ కాదు. కల్కి అయినా, భారతీయుడు-2 అయినా లెంగ్త్ నేను పట్టించుకోను. సినిమా ఆడాలి, నా పాత్ర బాగుండాలి.”