జాన్వీ కపూర్ పూర్తిగా కోలుకుంది. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆమె తొలిసారి ఈరోజు బయటకొచ్చింది. తన కొత్త సినిమా ప్రమోషన్ లో ఆమె ఎప్పట్లానే మెరిసింది.
“ఉలజ్” సినిమా ప్రమోషన్ కోసం మరోసారి మీడియా ముందుకొచ్చింది జాన్వీ కపూర్. ఆమెకు ఈమధ్య ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. ఆమెను హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
దీంతో 2 రోజుల పాటు తన సినిమా ప్రచారానికి దూరమైన జాన్వీ కపూర్, ఈరోజు మీడియా ముందుకొచ్చింది. సినిమా గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా తన తల్లి, చెల్లెలిపై ఆసక్తికర ప్రకటనలు చేసింది.
అమ్మ (శ్రీదేవి) బతికున్నంతవరకు తనకు, తన చెల్లి ఖుషీ కపూర్ కు స్వయంగా తినిపించేందట. తల్లి మరణించిన తర్వాత ఇంట్లో తన భోజనం తానే చేస్తున్నానని, అప్పుడప్పుడు ఖుషీ కపూర్ కు తను తినిపిస్తున్నానని చెప్పుకొచ్చింది. చర్మ సౌందర్యానికి నెయ్యి చాలా మంచిదని, అయితే ఖుషీకి నచ్చదని, అలాంటి సందర్భాల్లో తను స్వయంగా చెల్లెలికి తినిపిస్తానని అంటోంది.