రేవ్ పార్టీకి వెళ్లలేదు అని ఒక వీడియో విడుదల చేసి తప్పించుకుందామని అనుకొంది హేమ. ఐతే, ఎవరినైనా మాయ చెయొచ్చు కానీ పోలీసులకు కోపం వచ్చేలా చేస్తే వాళ్ళు సినిమా చూపిస్తారు. హేమ విషయంలో అదే జరిగింది. ఆమె తాను ఎక్కడికి వెళ్ళలేదు అని, (హైదరాబాద్) ఫార్మ్ హౌస్ లో “చిల్ అవుతున్నాను” అంటూ వీడియో విడుదల చేసి అడ్డంగా బుక్ అయింది.
బెంగుళూరు పోలీసులకు ఎందుకు కోపం వచ్చిందో కానీ హేమ చెప్పేది అబద్దం అంటూ మొదట ఒక ఫోటో విడుదల చేశారు. రేవ్ పార్టీలో హేమ దిగిన ఫోటో అది. అందులో ఆమె వేసుకున్న డ్రెస్, హేమ వీడియోలో “కహానీలు” చెప్పిన డ్రెస్ ఒక్కటే. ఆమె వీడియో తీసింది కూడా బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీకి చెందిన ఫార్మ్ హౌజే.
ఇంకా ఆమె పరువు తీయాలని కాబోలు నిన్న రాత్రి మరో వీడియో విడుదల చేశారు. మొత్తం ముఖాన్ని కవర్ చేసుకొని హేమ ఫార్మ్ హౌజ్ నుంచి వస్తున్న వీడియో అది. సో, హేమ రేవ్ పార్టీలో ఉంది అన్న విషయం రూఢి అయింది. అంతేకాదు, బెంగుళూరు పోలీస్ కమీషనర్ మరో విషయాన్ని బయట పెట్టారు. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అందులో హేమ కూడా ఉందట. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై ఆమెని వదిలారు. విచారణ ఇంకా జరుగుతోంది అని పోలీసులు తెలిపారు.
హేమ కవరింగ్ తిప్పలు
ALSO CHECK: Post-Rave party, Hema shares a Biryani recipe video
ఐతే, పోయిన పరువు కాపాడుకునేందుకు ఆమె ఇప్పుడు సాధారణ గృహిణిలా మంచి బిర్యానీ వండుతూ, దాన్ని తాను వండే తీరు ఇది అని చెపుతూ మరో వీడియో పెట్టింది. ఇవన్నీ ఆమె “కవర్” డ్రైవులు.
కానీ జనం మాత్రం ఆమె వీడియో కింద పెడుతున్న కామెంట్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. హేమ ఆంటీ ఇంకా ఎందుకు “సుబ్బిని” వేషాలు అంటూ ట్రోల్ చేస్తున్నారు.