జాన్వీ కపూర్, ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ గురించి అందరికీ తెలుసు. జాన్వీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాడు శిఖర్. వీరి పెళ్లి గురించి కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడింది జాన్వీ.
“అతను నా సైన్యం. నాకు ఎప్పుడూ అండగా నిలబడుతాడు. నాకు 15 ఏళ్ళ వయసప్పటి నుంచి అతను నాకు ఫ్రెండ్. ఇందరమూ ఒకే చోట పెరిగాం. నాకు ఫ్యామిలీ మెంబర్ శిఖర్,” అని చెప్పింది.
జాన్వీ కపూర్ ఇంతకుముందు తన బాయ్ ఫ్రెండ్ గురించి ప్రస్తావన తీసుకు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అతని గురించి ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడుతోంది. బహుశా వీరి బంధం సీరియస్ టర్న్ తీసుకుందేమో. అందరూ ఊహిస్తున్నట్లు త్వరలోనే పెళ్లి బాజాలు మోగడం ఖాయంగా కనిపిస్తోంది.
జాన్వీ కపూర్ మాత్రం పెళ్లి మాట తీయడం లేదు. తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతోంది కానీ పెళ్లి గురించి ఇప్పుడే ప్రశ్నలు అడగొద్దు అని కోరుతోంది.