సమంత ఆదివారం ఒక ఫోటో పెట్టి తీసేసింది అంటూ సోషల్ మీడియా హంగామా చేస్తోంది. ఆమె పెట్టిన ఫోటో అట్లాంటి ఇట్లాంటి ఫోటో కాదని ట్విట్టర్ (X.కాం)లో హడావుడి జరుగుతోంది. ఆమె పెట్టింది న్యూడ్ ఫోటో అనేది వారి మాట.
కానీ, ఒక పెద్ద హీరోయిన్ అలాంటి ప్రైవేట్ ఫోటో ఎందుకు పబ్లిక్ గా పోస్ట్ చేస్తుంది? అనే డౌట్ ఎవరికైనా వస్తుంది కదా. అందుకే తెలుగుసినిమా.కామ్ ఆమె ఇన్ స్టాగ్రామ్ చెక్ చేసింది. ఆమె ఇన్ స్టార్ స్టోరీస్ లో కానీ, ఆమె నార్మల్ ఇన్ స్టాగ్రామ్ ఫీడ్ లో కానీ అలాంటి న్యూడ్ ఫోటో కనిపించడం లేదు.
కానీ ట్విట్టర్ లో మాత్రం జనం డిస్కస్ చేస్తున్న మాట ఏంటంటే … ఆమె బాత్ టబ్బులో కూర్చొని ఉన్న ఫోటోని పోస్ట్ చేసి, ఆ తర్వాత తొలిగించింది.
ఆమె ఒక ఇన్ఫ్రా రెడ్ సానా (ఒకలాంటి ఆరోగ్యకర స్నానం)కి సంబంధించిన స్టోరీ, దాంతో పాటు తాను బట్టలు లేకుండా బాత్ టబ్బులో కూర్చున్న ఫోటోని పోస్ట్ చేసింది అని సోషల్ మీడియాలో జనం చెప్తున్నారు. కానీ తెలుగుసినిమా.కామ్ చెక్ చేసినప్పుడు ‘సానా’కి సంబందించిన పోస్ట్ మాత్రమే ఉంది. దాంతో పాటు హీరోయిన్ త్రిషకి పుట్టిన రోజు శుభాకాంక్షలు పోస్ట్ కూడా ఉంది. బాత్ టబ్బు ఫోటో అనేది లేదు.
ట్విట్టర్ లో ఇది సమంత డిలిట్ చేసిన ఫోటో అంటూ బాత్ టబ్బులో కూర్చొని ఒక సెల్ఫీ తీసుకున్న ఫోటోని వైరల్ చేస్తున్నారు. అందులో సమంత ముఖం లేదు. ఇది పూర్తిగా ఫేక్ అని అర్థం అవుతోంది.