
హాలీవుడులో హీరోయిన్లు నగ్నంగా నటించేందుకు అభ్యంతరం చెప్పరు. కథలో అవసరం ఉంది అనుకుంటే సై అంటారు. మన దేశంలో ఇంకా ఆ సంస్కృతి రాలేదు. ముద్దు సీన్లకి చాలా మంది హీరోయిన్లు వెనుకాడడం లేదు. శృంగార సన్నివేశాలకు కొందరు హీరోయిన్లు మాత్రమే ఓకె అంటున్నారు. నగ్నంగా కనిపించడం అంటే కష్టమే.
రాధికా ఆప్టేలాంటి ఒకరిద్దరు హీరోయిన్లు ఇప్పటివరకు అలా నటించారు. తాజాగా ఆండ్రియా అలా దర్శనమిచ్చేందుకు ఒప్పుకుందన్న వార్త బయటికి వచ్చింది.
ఈ విషయాన్ని దర్శకుడు మిస్కిన్ వెల్లడించారు. పిశాచి 2 (Pisasu 2) అనే తమిళ సినిమాలో ఆమె నగ్నంగా నటించేందుకు ముందుకొచ్చిందట. ఆ సన్నివేశంలో అలా కనిపించాలి అనే విషయం ఆమె అర్థం చేసుకొని ధైర్యంగా ఒప్పుకుందట. కానీ తానే వెనుకాడినట్లు చెప్పుకొచ్చారు మిస్కిన్. ఆండ్రియా డేరింగ్ నెస్ ని ఆయన మెచ్చుకున్నారు.
ఆ సినిమా మొదటి భాగం హిట్టయింది. కానీ ఈ రెండో భాగం చాలా కాలంగా సెట్ పైనే ఉండిపోయింది. ఇంకా విడుదలకు మోక్షం కలగడం లేదు.