ఎన్టీఆర్ హీరోగా నటించిన “దేవర” సినిమాలో కొన్ని సీన్లకు కత్తెర పడనుంది అనే టాక్ మొదలాయింది.
ఈ సినిమాలో 4 సన్నివేశాలపై అభ్యంతరాలు వచ్చేలా ఉన్నాయట. మరీ ముఖ్యంగా షార్క్ ఫైట్ విషయంలో సెన్సార్ టీం ఒప్పుకునే ప్రసక్తి లేదంట. దీంతో పాటు కత్తిపై శరీరం వేలాడే సన్నివేశంపై కూడా కత్తెర పడే అవకాశం ఉంది.
మొత్తంగా నాలుగు సన్నివేశాలు సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసేలా ఉన్నాయట. వాటికి ముందే ప్రిపేర్ అయింది టీం. ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ వచ్చేలా ఇప్పటికే మార్పులు, చేర్పులు పూర్తి చేసినట్లు సమాచారం.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా “దేవర-1.” కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రీకొడుకు పాత్రల్లో కనిపిస్తున్నాడు తారక్. జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు.