సైట్ అంటే ఇదేదో గచ్చిబౌలిలో జాగా అనుకోవద్దు. శృతిహాసన్ కు ఐ-సైట్ ఉంది. తనకు షార్ట్ సైట్ (తెలుగులో దీన్ని హ్రస్వ దృష్టి అంటారు) ఉందని, అందుకే తరచుగా అద్దాలు పెట్టుకుంటానని చెబుతోంది.
“నాకు షార్ట్ సైట్ ఉంది. సాధారణంగా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటాను. కానీ అప్పుడప్పుడు కళ్లకు ఎలర్జీ వస్తుంది. అలాంటప్పుడు అద్దాలు పెట్టుకుంటాను. ప్రస్తుతం ఎలర్జీ ఉంది. అందుకే కళ్లజోడు పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు కొత్త ఫ్రేమ్స్ ట్రై చేస్తుంటాను.”
తన గురించి ఉన్నదున్నట్టు దాచుకోకుండా చెప్పడం శృతిహాసన్ స్టయిల్. అది ఆరోగ్య సమస్య అయినా, వ్యక్తిగత సమస్య అయినా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు కంటికి సంబంధించి సైట్ ఉందని చెప్పుకొచ్చింది.
అంతేకాదు, లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడం కూడా తనకు నచ్చదంటోంది శృతిహాసన్. షార్ట్ హెయిర్ తో బ్యాంగ్స్ పెట్టుకోవడం తనకు ఇష్టమని, కానీ సినిమా ఫీల్డ్ లో ఉండడం వల్ల లాంగ్ హెయిర్ భరించక తప్పదని అంటోంది.