ఇప్పుడు అమెరికాలో భారతీయ సినిమాలకు క్రేజ్ పెరిగింది. ఇండియన్ యాక్టర్స్ తరుచుగా హాలీవుడ్ ప్రాజెక్ట్ లలో దర్శనమిస్తున్నారు. సడెన్ గా అమెరికా మన సినిమాపై ఆసక్తి పెంచుకోవడానికి కారణం ఏంటి? మన సినిమా క్వాలిటీ పెరిగిందా? లేదా మన సినిమాలు అంతగా వాళ్లకు నచ్చుతున్నాయా?
ఒక హాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక ఈ విషయంలో తన అభిప్రాయం ఏంటో వివరించింది.
“ఉన్నట్టుండి భారతీయ సినిమాలు కథలు చెప్పే విధానం మార్చుకోలేదు. కథల ఎంపిక కూడా మారలేదు. మా ఫిలిం మేకర్స్ ఎప్పుడూ ఆసక్తికరమైన కథలనే చెప్పారు. అయితే ప్రపంచం ప్రాచ్య దేశాలను చూసే విధానం మారింది. ప్రత్యేకించి భారతదేశాన్ని గమనించడం మొదలుపెట్టింది. అమెరికా బయట ఓ ప్రపంచం ఉందనే వాస్తవాన్ని గ్రహించడం ప్రారంభించారు. అందుకే హాలీవుడ్ మేకర్స్ కి, అమెరికన్లకు భారత్ పై మరింత ఆసక్తి పెరిగింది,” అని దీపిక చెప్పింది ఆ ఇంటర్వ్యూలో.
ఆమె ఇచ్చిన వివరణ బాగుంది.
దీపిక పదుకోన్ ప్రస్తుతం గర్భవతి. మరో నెల తర్వాత సినిమాలు తాత్కాలికంగా మానేస్తుందట. ఐతే త్వరలో విడుదల కానున్న “కల్కి 2898 AD” సినిమాని ప్రమోట్ చెయ్యనుంది.
దీపిక ఇప్పటికే హాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. డెలివరీ తర్వాత మళ్ళీ నటించడం మొదలు పెట్టాక మరిన్ని హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటుందట.