ప్రభాస్, కమల్ హాసన్ మొదటిసారిగా కలిసి నటించారు. అందుకే, తమ రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండేలా చూసుకున్నారు. ఒకటి ఒక నెలలో వస్తుంటే, మరోటి మరో నెలలో. అలా ప్లాన్ చేశారు.
ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 AD” సినిమాలో కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తారు. “కల్కి” జూన్ 27న విడుదల కానుంది. అందుకే, తన “భారతీయుడు 2” సినిమాని కమల్ హాసన్ జులై 12న విడుదల చేస్తున్నారు. అంటే కల్కి విడుదలైన 15 రోజుల తర్వాత “భారతీయుడు 2” థియేటర్లలోకి వస్తుంది.
“కల్కి 2898 AD”, “భారతీయుడు 2″… రెండూ పాన్ ఇండియా చిత్రాలే. అన్ని భాషల్లో భారీగా విడుదల అవుతాయి. అందుకే, రెండింటి మధ్య గ్యాప్ ఉంచాలని మొదటి నుంచి ప్లాన్ చేశారు. ఇటీవల “కల్కి” సినిమాని మే 9 నుంచి జూన్ 27కి వాయిదా వేశారు. దాంతో కమల్ హాసన్ మూవీ కూడా వెనక్కి వెళ్ళక తప్పలేదు.
“కల్కి” సినిమాలో కమల్ హాసన్ పాత్ర నిడివి తక్కువే కానీ నెగెటివ్ రోల్.