హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి పెళ్లి విషయంలో ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి. తనను అర్థం చేసుకునేవాడు దొరికేంత వరకు పెళ్లి చేసుకోదట.
“సినిమా ఇండస్ట్రీలో పని చేసే వాళ్ళ జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ ఒత్తిడి వేరు. నా వృత్తిని, నా వృత్తిలో ఉండే సాధక బాధకాలు అర్థం చేసుకునే వాడు కావాలి. అలాంటి వాడు జీవితంలోకి రావాలి. ఆ సరైనవాడు దొరికితే పెళ్లి చేసుకుంటా,” అని చెప్పింది.
మృణాల్ ఠాకూర్ కెరీర్ ఇప్పుడు బాగా సాగుతోంది. తాజాగా హిందీలో ఒక పెద్ద సినిమా సైన్ చేసింది.
తెలుగులో “ఫ్యామిలీ స్టార్” ఫ్లాప్ తర్వాత ఆమె మరో సినిమా సైన్ చెయ్యలేదు. కానీ “కల్కి 2898 AD”లో ఆమె గెస్ట్ రోల్ లో దర్శనమిస్తుంది అనే ప్రచారం ఉంది. సినిమా విడుదల తర్వాత ఆ వార్తల్లో నిజమెంతో తెలుస్తుంది.