
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు వెంకటేష్. ఆయన తర్వాత ఆ సినిమా అద్భుతంగా ఎవరికైనా కలిసొచ్చిందంటే అది బుల్లిరాజుకు మాత్రమే. అతడే భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. ఈ పేరు చెబితే చాలామంది ఈ పిల్లాడ్ని గుర్తుపట్టరు. అదే బుల్లిరాజు అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు.
ఇప్పుడీ బుల్లిరాజు ఏకంగా చిరంజీవితో కలిసి నటించే అవకాశం అందుకున్నాడు. అనీల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో బుల్లి రాజు కూడా ఉన్నాడు. రీసెంట్ గా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ క్లిప్ లీక్ అయింది. అందులో చిరంజీవి పక్కన బుల్లిరాజు కూడా ఉన్నాడు. వీళ్లిద్దరి కాంబోలో కొన్ని కామెడీ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ వెంకీ-బుల్లిరాజు కాంబినేషన్ అదిరింది. ఈ కొత్త సినిమాలో చిరు-బుల్లిరాజు కామెడీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందంటున్నారు యూనిట్ జనం. అసలే కామెడీ టైమింగ్ లో చిరంజీవి నంబర్ వన్. ఇలాంటి నటుడితో బుల్లిరాజు కామెడీ అంటే నవ్వులే నవ్వులు.
అన్నట్టు ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నారు. జనవరి 10 అనే తేదీని దాదాపు ఫిక్స్ చేశారు.