“రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా మధ్య మాంచి ఎఫైర్ నడుస్తోంది…”
“మాల్వి మాయలో పడి రాజ్ తరుణ్ నన్ను వదిలేశాడు…. “
“మాల్వి బ్రదర్ నన్ను బెదిరించాడు…”
ఇలాంటి ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య. అంతే కాదు రాజ్ తరుణ్ పై, మాల్విపై కేసు కూడా పెట్టింది. ఆ కేసు నమోదై ఇప్పటికే నెల గడిచింది. ఇంకా సద్దుమణగలేదు. అనేక మలుపులు తిరుగుతోంది. ఇలా రాజ్ తరుణ్, మాల్వి వార్తల్లో ఉన్న టైంలోనే వీరిద్దరూ కలిసి నటించిన “తిరగబడరా సామి” విడుదలైంది.
ఆగస్టు 2న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. “ఆంధ్రుడు”, “పిల్లా నువ్వు లేని జీవితం” వంటి సినిమాలు తీసిన ఏ.ఎస్.రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి కనీసం 10 లక్షల రూపాయం కూడా రాలేదు. అంత ఘోరమైన ఓపెనింగ్స్ తెచ్చుకొంది.
రాజ్ తరుణ్, మాల్వి కేసుకు సంబంధించి వీడియోలకు యూట్యూబ్ ల్లో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. కానీ అదే జనం థియేటర్ కి మాత్రం రావడం లేదు. రాజ్ తరుణ్ సోలో హీరోగా హిట్ అందుకొని చాలా కాలమే అయింది. ఆఫ్ స్క్రీన్ లో అతని లవ్ లైఫ్ చాలా కలర్ ఫుల్ గా ఉందని లావణ్య చెప్తున్న విషయాలను బట్టి అర్థం అవుతోంది. బిగ్ బాస్ భామ అరియనా గ్లోరీ సహా ఎవరినీ వదిలి పెట్టలేదు రాజ్ తరుణ్ (అదేనండి ప్రేమ) అని లావణ్య చెప్పింది.
అందుకే జనం ఆమె చెప్పే మాటలు యూట్యూబ్ లో ఆసక్తికరంగా చూసి … రాజ్ తరుణ్ స్క్రీన్ మీద చేసే లిప్ లాకులు, రొమాన్స్ లు, తిరగబడడాలపై ఆసక్తి చూపడం లేదు అన్నమాట.