
క్యాథరీన్ త్రెసా.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ‘టాపు లేచిపోద్ది’ అనే సాంగ్ గుర్తొస్తుంది. బన్నీతో కలిసి గతంలో టాపు లేపిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మెగాస్టార్ తో కలిసి నటించబోతోంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమా కోసం క్యాథరీన్ ను తీసుకున్నారు.
అయితే ఈ సినిమాలో క్యాథరీన్ మెయిన్ హీరోయిన్ కాదు. ఫస్ట్ హీరోయిన్ గా నయనతారను దాదాపు లాక్ చేశారు. సెకెండ్ హీరోయిన్ గా క్యాథరీన్ ను తీసుకున్నారు. రావిపూడి కాస్టింగ్ సెలక్షన్ ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటుంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ను ముగ్గురు పిల్లల తల్లిగా చూపించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు క్యాథరీన్ ను ఎలా చూపించబోతున్నాడనే చర్చ ఊపందుకుంది. మరీ ముఖ్యంగా క్యాథరీన్ తో కామెడీ చేయించబోతున్నాడనే టాక్ నడుస్తోంది.
చిరు-అనీల్ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లాక్ చేశారు. సాహు గారపాటి నిర్మించబోయే ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించబోతున్నాడు.