
గీతా కాంపౌండ్ ను బన్నీ వాస్ ను విడదీసి చూడలేం. అల్లు ఫ్యామిలీలో అంతర్భాగం బన్నీ వాసు. అరవింద్, అల్లు అర్జున్ మాట కాదని బన్నీ వాస్ ఏ పని చేయరు. కానీ ఈసారి లెక్క మారబోతోంది. అరవింద్ కు నచ్చకపోయినా సినిమాలు తీస్తానంటున్నాడు బన్నీ వాస్.
“నా వ్యక్తిగత అభిరుచికి తగ్గ కథలు కొన్ని ఉన్నాయి. అవి అరవింద్ గారికి నచ్చవు. ఇంతకుముందు ఏంటంటే, ఆయనకు నచ్చకపోతే నేను తీసేవాడ్ని కాదు. కానీ ఇకపై ఆయనకు చెప్పి, ఆయన వద్దన్నా కూడా నాకు నచ్చిన సినిమాలు నేను నిర్మించుకుంటాను.”
స్వయంగా బన్నీ వాస్ చెప్పిన మేటర్ ఇది. ఆల్రెడీ వయసైపోతోందని, ఇప్పటికైనా తన మనసుకు నచ్చిన సినిమాలు నిర్మించుకుంటానని ఆయన ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా మరో ఊహాగానంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు.
బన్నీ వాసు, గీతాఆర్ట్స్ కు దూరమౌతున్నాడనే ప్రచారం జరిగింది ఆమధ్య. అలాంటిదేం లేదని.. అరవింద్ కు, తనకు ఉన్న బాండింగ్ మధ్య అసలిలాంటి ప్రశ్నే తలెత్తదని క్లారిటీ ఇచ్చాడు బన్నీ వాస్. ప్రస్తుతం తామిద్దరం గీతా ఆర్ట్స్ కు సంబంధించి వ్యవస్థను బిల్డ్ చేసే పనిలో ఉన్నామని.. అరవింద్ తర్వాత తను, తన తర్వాత వేరే వ్యక్తిని రెడీ చేయాలని అన్నాడు.