
“సింగిల్” సినిమా ట్రైలర్ రేపిన వివాదం విషయంలో నిర్మాత బన్ని వాసు స్పందించాడు. మంచు విష్ణు పేరు ఎత్తకుండా జనాలకు అర్థం అయ్యేలా ట్వీట్ చేశాడు. బన్నీ వాసు ట్వీట్ ఇది: “ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది.. అలాగే ఎందుకిప్పుడు గొడవలు అని కూడా ఉంది.. శాంతి.. శాంతి.. శాంతి..!”
ALSO READ: మంచు vs అల్లు: బూతు తొలగింపు
మంచు విష్ణుకి వ్యతిరేకంగా బన్నీ వాసు పెట్టిన ట్వీట్ అని అర్థం అవుతోంది. “సింగిల్” ట్రైలర్ లో బతుకు మంచు కురిసిపోయింది అనే డైలాగ్ పెట్టడంతో మంచు విష్ణు అగ్గి మీద గుగ్గిలంలా ఈ సినిమా టీంపై ఎగిరిపడ్డాడట. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు టీం మెంబర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దాంతో బన్నీ వాసుకి కూడా మంచు విష్ణుపై కోపం వచ్చింది.
కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను అనే అర్థంలో పై ట్వీట్ పెట్టాడు.
మొత్తానికి ఒక ట్రైలర్, ఆ ట్రైలర్ లో కొన్ని సెటైర్లు ఇలా మంటలు రేపాయి. అల్లు, మంచు టీంల మధ్య గొడవ స్టార్ట్ అయింది.