
మంచు విష్ణుకి కోపం వచ్చింది. ఒక ట్రైలర్ లో బూతు అర్థం వచ్చేలా తమ ఇంటిపేరుని వాడడంతో మంచు విష్ణు ఫైర్ అయ్యాడు. ఏకంగా నిర్మాత అల్లు అరవింద్ కి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడాడట.
ఇంతకీ ఈ వివాదం ఏంటంటే… శ్రీ విష్ణు హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో “సింగిల్” (#Single) అనే సినిమా విడుదల కానుంది. ఆ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ లో బాలయ్య డైలాగ్ లపై, “శివయ్య” అంటూ ‘కన్నప్ప’ సినిమా డైలాగ్ పై, ఇంకా ఇతర సినిమాలపై కామెడీ ఉంది.
ఇవేవి మంచు విష్ణుకి కోపం తెప్పించలేదు. కానీ ట్రైలర్ చివర్లో హీరో… “వాడి బతుకు మంచు కురిసిపోతుంది అని కుర్రు కుర్రు అంటాయిరా” అని పలకడంతో విష్ణుకి ఆగ్రహం కట్టలు తెగింది.
మా ఇంటి పేరుని ఒక బూతు పదానికి ‘రీప్లేస్ మెంట్’లా వాడుతారా? రేపొద్దున నేను కూడా నా సినిమాలో ఒక బూతు ప్లేసులో ‘అల్లు’ అని పెడతాను మీకు ఓకేనా అని అరవింద్ ని, ఆ సినిమా టీంని ప్రశ్నించారట. దాంతో, టీం మొత్తం అలెర్ట్ అయింది.
ఇప్పుడు ఆ డైలాగ్ తొలగించి సినిమాలో లేకుండా చేస్తారంట.