కంగనా రనౌత్ తన మాట తీరుతో ఎంపీ అయింది. బీజేపీ పెద్దలను మెప్పించింది. ఐతే ఇదంతా గతం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మునుపటిలా బలంగా లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడి ఉంది. అందుకే, ఇప్పుడు మితిమీరి మాట్లాడే తమ పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటోంది.
అలా తాజాగా కంగనా రనౌత్ కి బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. పార్టీ పాలసీ విషయాలపై మాట్లాడే అధికారం, అనుమతి ఆమెకు లేదని స్పష్టం చేసింది అధిష్టానం.
రైతుల ఉద్యమానికి సంబంధించి ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నార్త్ ఇండియాలో పార్టీని ఇబ్బంది పెట్టెలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. దాంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. కంగన స్థాయిని కుదించి నష్ట నివారణ చేపట్టింది.
కంగన మంత్రి పదవి కూడా దక్కుతుందని ఆశించింది. కానీ యిప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఆమె మునుపటిలా ఏది పడితే అది మాట్లాడే స్వేచ్ఛ లేదు.