
ఏ ఆర్ రెహమాన్ ఇటీవల గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారు. అది గుండెనొప్పి కాదు డిహైడ్రేషన్ కారణంగా నీరసం వచ్చి పడిపోయారు అని తర్వాత డాక్టర్లు తెలిపారు. కొద్ది రోజులు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పడంతో పది రోజులు ఇంటిపట్టునే ఉన్నారు. ఆ కారణంగానే రామ్ చరణ్ సినిమా “పెద్ది” వీడియో గ్లిమ్ప్స్ కి రెహమాన్ నేపథ్య సంగీతం పూర్తి చెయ్యలేకపోయారు.
దాంతో రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు విడుదల కావాల్సిన వీడియో గ్లిమ్ప్స్ వాయిదాపడి ఈ నెల 6న రానుంది. రెహమాన్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. “పెద్ది” వీడియోకి మ్యూజిక్ పూర్తి చేశారు.
అలాగే మళ్ళీ లైవ్ షోలు కూడా మొదలు పెట్టారు. వచ్చే నెలలో ముంబైలో మొదటి భారీ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత జులై, ఆగస్టులో అమెరికా అంతా టూర్లు వేస్తున్నారు. అనేక నగరాల్లో అక్కడ కాన్సర్ట్ షో చేస్తారు.
రెహమాన్ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సినిమాకి, అలాగే మణిరత్నం సినిమా “థగ్ లైఫ్”కి సంగీతం అందిస్తున్నారు.