సైలెంట్ గా తన సినిమా పూర్తి చేస్తోంది అనుష్క. క్రిష్ దర్శకత్వంలో “గాటి” అనే సినిమా షూట్ నడుస్తోంది. ప్రస్తుతం నైట్ షూట్ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలోని ఈ సెట్ కు పక్కనే “పుష్ప-2” షూట్ నడుస్తోంది. అల్లు అర్జున్ పై కొన్ని సన్నివేశాలు తీస్తున్నాడు సుకుమార్.
అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్-పూరి బిజిబిజీగా ఉన్నారు. “డబుల్ ఇస్మార్ట్” కోసం రామ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు పూరి. ఇక ఇదే లొకేషన్ లో “విశ్వం” షూట్ కూడా నడుస్తోంది. సునీల్ మరికొందరు ఆర్టిస్టులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు శ్రీనువైట్ల.
ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా “కుబేర”. ఈ సినిమా కోసం ఆల్రెడీ ఓసారి ముంబయి వెళ్లొచ్చింది యూనిట్. ఇప్పుడు మరోసారి ముంబయిలోనే కొత్త షెడ్యూల్ మొదలైంది.
అటు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ హైదరాబాద్ లోనే తమతమ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ “మట్కా” కోసం, సాయితేజ్ కొత్త సినిమా కోసం హైదరాబాద్ లో 2 వేర్వేరు సెట్స్ వేశారు. అందులో షూటింగ్స్ నడుస్తున్నాయి.